ETV Bharat / city

జులై 5న వ్యాస పూర్ణిమను అధికారికంగా నిర్వహించాలి: గంగపుత్ర మహిళా సభ - mahila sabha latest News

తెలంగాణ గంగపుత్ర మహిళా సభ రెండు వసంతాలను పూర్తి చేసుకుని మూడో ఏడాదిలోకి అడుగుపెట్టినట్లు సంస్థ వెల్లడించింది. ఈ మేరకు గంగపుత్ర మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించింది.

వేదవ్యాస్ జయంతిని ప్రభుత్వమే నిర్వహించాలి : అరుణ జ్యోతి బెస్త

author img

By

Published : Jul 4, 2020, 12:45 AM IST

Updated : Jul 4, 2020, 1:35 AM IST

జులై 5న వ్యాస పుర్ణిమను అధికారికంగా నిర్వహించాలి: గంగపుత్ర మహిళా సభ

తెలంగాణ గంగపుత్ర మహిళా సభ రెండు వసంతాలను పూర్తి చేసుకుని మూడో ఏడాదిలోకి అడుగుపెట్టినట్లు మహిళా సభ ప్రెసిడెంట్ అరుణ జ్యోతి బెస్త తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర గంగపుత్ర మహిళలకు అరుణ శుభాకాంక్షలు తెలియజేశారు.

జీఓ6 ను రద్దు చేస్తేనే మాకు న్యాయం..

గంగపుత్ర మహిళలను చైతన్య పర్చడమే తమ లక్ష్యమన్నారు. వృత్తి పరంగా రాష్ట్ర ప్రభుత్వం తమ కులానికి అపార నష్టం చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే జీఓ నెం.6ను రద్దుచేసి తమకు న్యాయం చేయాలని కోరారు. ఉద్యమ సమయంలో తాము గంగపుత్రుల వెన్నంటే ఉంటామని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటూ తమను విస్మరించడం పట్ల గంగపుత్ర మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులు, చేపల మీద తమకే పూర్తి హక్కు కేటాయించాలని సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్, సీఎస్ సోమేశ్ కుమార్​ను కోరారు.

సంత్ సేవాలాల్ లాగే జరిపించాలి

గంగాదేవి, వేద వ్యాసుడి విగ్రహాలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గంగపుత్ర సంఘాల్లో ప్రతిష్టించాలని అరుణ కోరారు. యావత్ భారతం పవిత్ర గ్రంథంగా ఆరాధించే మహాభారతాన్ని రచించిన వేద వ్యాసుడు గంగపుత్ర సత్యవతి తనయుడని ఆమె పేర్కొన్నారు. భారతాన్ని 4 వేదాలగా లిఖించినందునే వ్యాసుడు వేద వ్యాసుడయ్యాడని వివరించారు. వ్యాసుడి ఘన చరిత్రను దేశ వ్యాప్తంగా అందరూ తెలుసుకోవాలని ఆమె కోరారు. పిల్లలకు, విద్యార్థులకు ఇతిహాసాలు బోధించాలన్నారు. జూలై 5న వేదవ్యాస్ జయంత్యుత్సవాలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలన్నారు. గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ జయంతిని ప్రభుత్వమే అధికారికంగా జరిపించడం హర్షణీయమనీ.. వ్యాసుడి జయంత్యుత్స్యవాలనూ జరిపించాలని స్పష్టం చేశారు.

మాపై వివక్ష మానాలి..

తెరాస సర్కార్ తెచ్చిన Go.6 వల్ల సాంప్రదాయక మత్స్యకార కులాలు బెస్త, గూండ్ల పట్ల ఇతర కులాల దౌర్జన్యం పెరిగినట్లు హైదరాబాద్ జిల్లా సహకార సంఘాల ఛైర్​పర్సన్ , మహిళా సభ ప్రిన్సిపల్ అడ్వైజర్ కొప్పు పద్మ బెస్త ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమపై వివక్ష మానుకోవాలని పద్మ హితవు పలికారు. ఎన్నో పోషక విలువలు ఉన్న చేపలు సమాజానికి అందిస్తున్నామని... మత్స్య మహిళలు వృత్తిలో భాగంగా చనిపోతే 10 లక్షల రూపాయలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.

అబల స్వతంత్రంగా నిలబడాలి..

అన్ని రంగాల్లో గంగపుత్ర మహిళలు అభివృద్ధి చెందాలని.. స్వతంత్రంగా విద్యా, ఉద్యోగ , వ్యాపార రంగాల్లో నిలదొక్కుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ మహిళా మోర్చ ప్రధాన కార్యదర్శి , మహిళా సభ కార్యదర్శి అనిత బెస్త స్పష్టం చేశారు. కార్యక్రమంలో మహిళా సభ ప్రతినిధులు హేమలత బెస్త , సంతోషి బెస్త , భార్గవి, అనురాధ, నాగమణి, శ్వేత, విజయలక్ష్మి, రాధిక, మంజు, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : కోదండరాం నిరసన దీక్ష.. ప్రజల బతుకులు కాపాడాలని డిమాండ్

Last Updated : Jul 4, 2020, 1:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.