ETV Bharat / city

రెండు డోసులకూ ఒకే టీకా... పంపిణీపై సర్కారు సన్నద్ధత - తెలంగాణ తాజా వార్తలు

ఒకేసారి ఎక్కువ వ్యాక్సిన్‌లు వస్తే అయోమయానికి ఆస్కారం ఉందని వైద్యవర్గాలు హెచ్చరిస్తున్నాయి. కొవిడ్‌ టీకాను 2 డోసుల్లో తీసుకోవాల్సి ఉండడంతో.. మొదటి డోసులో పొందిన టీకానే.. 4 వారాల తర్వాత రెండో డోసులో పొందాలని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఏ కేంద్రానికి వెళ్లాలనే సమాచారం టీకా పొందే వ్యక్తికి సంక్షిప్త సందేశం రూపంలో లబ్ధిదారునికి, సమీపంలోని ఆరోగ్య సిబ్బందికి చేరుతుంది. ప్రతి కేంద్రంలోనూ కనీసం 3 గదులు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. దుష్ఫలితాలను ఎదుర్కొనేందుకు సమర్థంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని శాఖలు, స్వచ్ఛంద సంఘాల భాగస్వామ్యం చేయనున్నారు. కొవిడ్‌ టీకా పంపిణీపై సర్కారు సన్నద్ధమవుతోంది.

government-readiness-for-distribution-and-single-vaccine-for-two-doses
రెండు డోసులకూ ఒకే టీకా... పంపిణీపై సర్కారు సన్నద్ధత
author img

By

Published : Dec 22, 2020, 7:25 AM IST

దేశంలో ఏ కొవిడ్‌ టీకాలకు అనుమతి లభిస్తుందో స్పష్టత లేకున్నా.. వచ్చేనెల రెండోవారంలో ఒక టీకా.. మరో 2, 3 నెలల్లో మరికొన్ని టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. కొవిడ్‌ టీకాను 2 డోసుల్లో తీసుకోవాల్సి ఉండడంతో.. మొదటి డోసులో పొందిన టీకానే.. 4 వారాల తర్వాత రెండో డోసులో కూడా పొందాలని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఈ విషయంలో ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు వైద్యసిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలంది. టీకా మొదటి డోసు, రెండో డోసు ఏయే తేదీల్లో పొందాలి.. ఏ కేంద్రానికి వెళ్లాలనే సమాచారం సంక్షిప్త సందేశం రూపంలో లబ్ధిదారునికి, సమీపంలోని ఆరోగ్య సిబ్బందికి చేరుతుంది.

రాష్ట్రంలో కొవిడ్‌ టీకా పంపిణీపై ఇటీవల జిల్లా స్థాయిలో నిర్వహించిన టాస్క్‌ఫోర్స్‌ సమావేశంలో పలు అంశాలపై ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు దిశానిర్దేశం చేశారు. టీకాల పంపిణీలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్‌ అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందజేస్తాయి. కొవిడ్‌పై అపోహలు, అనుమానాలను తొలగించడంలో మీడియాను, పంపిణీ సక్రమంగా జరిగేందుకు ఏఎంఏ ప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలలను, పోలీసు, ఐసీడీఎస్‌, పంచాయతీరాజ్‌, పురపాలక, రెవెన్యూ, విద్యుత్‌, విద్య తదితర శాఖలను, స్వయం సహాయక, యువజన, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ తదితర సంఘాల సహకారాన్ని స్వీకరించనున్నారు.

government-readiness-for-distribution-and-single-vaccine-for-two-doses
రెండు డోసులకూ ఒకే టీకా... పంపిణీపై సర్కారు సన్నద్ధత

సమస్తం డిజిటలీకరణ

  • కొవిడ్‌ టీకాలను ఉత్పత్తి సంస్థ నుంచి పంపిణీ కేంద్రం వరకూ సరఫరా చేయడంలో.. అన్ని స్థాయుల్లోనూ 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద.. -15 నుంచి -25 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద భద్రపరచడానికి వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు.
  • టీకా పొందే ప్రతి వ్యక్తి సమాచారాన్ని నమోదు చేసేందుకు ఆధార్‌ సంఖ్య తరహాలో ఇతర అధీకృత గుర్తింపు కార్డులతో ముడి పెడతారు.
  • టీకాల నిల్వ కేంద్రాల సమాచారాన్ని డిజిటలైజేషన్‌ చేశారు. ఎలక్ట్రానిక్‌ వ్యాక్సిన్‌ ఇంటెలిజెన్స్‌ నెట్‌వర్క్‌(ఈ-విన్‌) విధానంలో 34 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, 720కి పైగా జిల్లాల్లోని కొవిడ్‌ టీకాల నిల్వ కేంద్రాలను అనుసంధానం చేశారు.
  • దేశంలో 28,500 కోల్డ్‌ చైన్‌ పాయింట్లు, 23000 టెంపరేచర్‌ లాగర్స్‌, 28000 ఈ-విన్‌ వినియోగదారుల సమాచారాన్ని పొందుపర్చారు.
  • కొవిన్‌ యాప్‌లో పేరు నమోదు చేసుకున్న ప్రతి వ్యక్తికి కూడా సంక్షిప్త సమాచారం, డిజిటల్‌ వెరిఫికేషన్‌ కోడ్‌.. క్యూఆర్‌ కోడ్‌ కూడా అందుతుంది. దాని ఆధారంగా టీకా వేస్తారు.

టీకా కేంద్రంలోనూ..

  • టీకా పంపిణీకి ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలలతో పాటు కమ్యూనిటీ హాళ్లు, పంచాయతీ భవనాలు, పురపాలక భవనాలను ఎంపిక చేస్తారు.
  • ఆసుపత్రుల్లో సాధ్యమైనంత వరకూ సాధారణ రోగుల సేవలకు దూరంగా టీకాల పంపిణీ నిర్వహిస్తారు.
  • ప్రతి కేంద్రంలోనూ కనీసం 3 గదులు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు.
  • ఒక గదిలో టీకాలు పొందేవారు వేచి చూస్తారు. మరోగదిలో టీకాలు వేస్తారు. టీకా వేయించుకున్నవారు 30 నిమిషాల పాటు ఇంకో గదిలో సిబ్బంది పర్యవేక్షణలో ఉంటారు.
  • ఈ క్రమంలో ఆరడుగుల భౌతిక దూరాన్ని పాటిస్తూ కుర్చీలు వేస్తారు.
  • అందరూ మాస్కులు ధరించాలి. సంకేత గుర్తులు వేసిన ప్రకారం కూర్చోవాలి.
  • టీకా కేంద్రాల్లో సబ్బు, నీళ్లు లేదా శానిటైజర్‌ను ఏర్పాటు చేయాలి.

ఆసుపత్రికో నోడల్‌ అధికారి

  • ప్రతి ఆసుపత్రిలోనూ నోడల్‌ అధికారిని నియమించాలి.
  • దుష్ఫలితాలను గుర్తించడంపై వైద్యసిబ్బందికి తప్పనిసరిగా ముందస్తు శిక్షణ ఇవ్వాలి. వెంటనే ఉన్నత స్థాయి అధికారులకు సమాచారం చేరవేయాలి.
  • ప్రతి టీకా కేంద్రంలోనూ దుష్ఫలితాల సత్వర చికిత్సకు ప్రత్యేక కిట్లు ఏర్పాటు చేయాలి.
  • దుష్ఫలితాలు ఎదురైతే అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్సు అందుబాటులో ఉంచాలి.
  • ప్రతి ఆసుపత్రిలోనూ దుష్ఫలితాలు వచ్చిన వ్యక్తి సమాచారాన్ని ప్రత్యేక పుస్తకంలో పొందుపర్చాలి.

ఐదుగురి బృందం

టీకాలిచ్చే బృందంలో ఐదుగురు సభ్యులు

  • ఇంజక్షన్‌ ఇవ్వడంలో శిక్షణ పొందిన వైద్యుడు లేదా నర్సు, ఏఎన్‌ఎం ఒకరు..
  • టీకాలు పొందడానికి వచ్చినవారిని క్రమపద్ధతిలో నడిపించడానికి పోలీసు, హోంగార్డు, ఎన్‌సీసీ సిబ్బంది
  • టీకా పొందే వ్యక్తి ధ్రువపత్రాలను పరిశీలనకు ఒకరు..
  • అక్కడ నిబంధనలను పాటించేలా చూడటంతో పాటు టీకా పొందిన అనంతరం 30 నిమిషాలు వేచి ఉండేలా ఒకరు పర్యవేక్షిస్తారు.
  • ఎక్కువమంది ఒకేసారి గుమికూడకుండా చూడడం.. టీకాలు పొందడానికి వచ్చేలా ప్రోత్సహించడం ఇంకొకరి బాధ్యత.

ఇదీ చదవండి: మనీ యాప్​ల ఆగడాలకు పాడాలి... చరమగీతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.