ETV Bharat / city

సాగర్, మిర్యాలగూడల్లో ఎత్తిపోతలు.. హాలియాలో డిగ్రీ కాలేజీ - హాలియాకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు

నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో పలు ఎత్తిపోతల పథకాలకు అనుమతి మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హాలియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

government permissions for lift irrigation schemes in nalgonda district
నల్గొండ జిల్లాలో పలు ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వ అనుమతులు
author img

By

Published : Dec 6, 2020, 8:24 PM IST

నల్గొండ జిల్లాలోని వివిధ ఎత్తిపోతల పథకాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. నాగార్జునసాగర్, మిర్యాలగూడ నియోజకవర్గాలకు లబ్ది చేకూరేలా ఎత్తిపోతల పథకాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. 5875 ఎకరాలకు నీరిచ్చేలా రూ. 75.93 కోట్లతో మూసీనదిపై కేశవాపురం వద్ద కొండ్రపోల్ ఎత్తిపోతలు చేపట్టనున్నారు. 4175 ఎకరాలకు నీరిచ్చేలా రూ.72.16 కోట్లతో నాగార్జునసాగర్ ఫోర్​షోర్​పై నెల్లికల్ ఎత్తిపోతలు నిర్మించనున్నారు. బల్నేపల్లి-చంప్లాతండా వద్ద రూ.219.90 కోట్లతో మరో ఎత్తిపోతలకు అనుమతులు ఇచ్చారు.

వాడపల్లి వద్ద రూ.229.25 కోట్లతో మరో ఎత్తిపోతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏఎమ్మార్పీ ఎత్తిపోతల 8, 9 డిస్ట్రిబ్యూటరీలకు నీరు సరఫరా అయ్యేలా మరమ్మతులు, పైప్​లైన్ పనుల కోసం రూ.2.47 కోట్లు మంజూరు చేశారు. ఈ మేరకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. నల్లగొండ జిల్లా హాలియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రకటించారు. డిగ్రీ కళాశాలను ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇదీ చూడండి: దేశంలో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.