ETV Bharat / city

భారతీయ భాషలకు సెంట్రల్‌ వర్సిటీ!

భారతీయ భాషలకు పెద్దపీట వేస్తామని జాతీయ నూతన విద్యావిధానంలో స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం తదనుగుణంగా వేగంగా అడుగులు వేస్తోంది. భారతీయ భాషలపై ప్రత్యేకంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేయాలని భావిస్తోంది.

భారతీయ భాషలకు సెంట్రల్‌ వర్సిటీ!
భారతీయ భాషలకు సెంట్రల్‌ వర్సిటీ!
author img

By

Published : Dec 5, 2020, 10:20 AM IST

మైసూరులోని భారతీయ భాషల కేంద్ర సంస్థ(సీఐఐఎల్‌)ను భారతీయ భాషల విశ్వవిద్యాలయం(బీవీవీ)గా ఉన్నతీకరించాలన్నది కేంద్రం ఆలోచన. సాధ్యాసాధ్యాల పరిశీలన, నిధుల అవసరం తదితరాలపై అధ్యయనంతో పాటు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌లేషన్‌ అండ్‌ ఇంటర్‌ప్రెటేషన్‌(ఐఐటీఐ) ఏర్పాటుపై నిపుణుల కమిటీని నియమించింది. కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్‌ ఎన్‌.గోపాలస్వామి నేతృత్వంలో మొత్తం 11 మందితో కమిటీని నియమించిన కేంద్రం మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మరోవైపు కమిటీలో తెలుగువారు ఒక్కరూ లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.

ప్రత్యేక కోర్సులు, పరిశోధనకు అనువుగా..
భారతీయ భాషలను ప్రోత్సహించడం, ద్వితీయ భాషలపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం తదితర లక్ష్యాల కోసం 1969లో కేంద్ర ప్రభుత్వం మైసూరులో సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియన్‌ లాంగ్వేజెస్‌(సీఐఐఎల్‌)ను స్థాపించింది. అందులో తెలుగుకు సంబంధించి ప్రాచీన తెలుగు భాషా కేంద్రం కూడా ఉండేది. ఏడాది క్రితం దాన్ని నెల్లూరుకు తరలించారు. జాతీయ నూతన విద్యావిధానంలో భాగంగా విద్యను ప్రాంతీయ భాషల్లో అందించాలన్నది కేంద్రం లక్ష్యం. ఈ క్రమంలోనే సీఐఐఎల్‌ను కేంద్రీయ విశ్వవిద్యాలయంగా మార్చాలని భావిస్తోంది. దానివల్ల భారతీయ భాషలపై ప్రత్యేకంగా కోర్సులు ప్రవేశపెట్టడం, పరిశోధనతో పాటు పట్టాలను సైతం ఇవ్వచ్చు. ఇప్పుడున్న సంస్థకు డిగ్రీ పట్టాలిచ్చే అధికారం లేక ప్రత్యేక గుర్తింపు కరవైంది. వర్సిటీగా మారితే నెల్లూరులోని ప్రాచీన తెలుగు పరిశోధనా కేంద్రం సైతం అనుబంధ విభాగంగా మారుతుంది.

వర్సిటీలో భాగంగా..ఐఐటీఐ?
కొత్త విద్యావిధానంలో సాంకేతిక విద్యను భారతీయ భాషల్లో అందిస్తామన్న కేంద్రం.. అందుకు ప్రత్యేకంగా అనువాదం కోసం ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌లేషన్‌ అండ్‌ ఇంటర్‌ప్రెటేషన్‌(ఐఐటీఐ)ను నెలకొల్పుతామని గతంలో ప్రకటించింది. తాజాగా నియమించిన కమిటీ దీని ఏర్పాటుపైనా అధ్యయనం చేసి నివేదిక అందజేయనుంది. అయితే కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఐఐటీఐ..వర్సిటీలో భాగంగా ఉంటుందా? ప్రత్యేక సంస్థగా ఉంచుతారా? అన్నది తేలాల్సి ఉంది. కేంద్రం ఆదేశాల మేరకు ఏడాది క్రితం తాము ఐఐటీఐకు ఐఐటీ, ఐఐఎం తరహాలో జాతీయ ప్రాధాన్య సంస్థ హోదా ఇవ్వాలని కేంద్రానికి సిఫారసు చేశామని సీఐఐఎల్‌ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ డీజీ రావు చెప్పారు.

ఇవీ చూడండి: వారసులు అందరికీ నచ్చలేదు... కొందరిని మాత్రమే వరించిన విజయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.