కరోనా రెండో దశలో చాలామందికి ఆక్సిజన్ అవసరమవుతోంది. అందుకే తెలుగురాష్ట్రాలు ప్రాణవాయువు నిల్వలపై దృష్టిసారించాయి. వాయు, రైల్వే, రోడ్డు మార్గాల ద్వారా ఖాళీ ఆక్సిజన్ కంటెయినర్లను చేరవేసి తిరిగి వాటిలో ఆక్సిజన్‌ను నింపుకుని రైలు, రోడ్డు మార్గాల ద్వారా ఆయా రాష్ట్రాలకు ఆక్సిజన్‌ను తరలిస్తున్నారు. రాష్ట్రానికి ఆరవ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్‌లోని భరత్ నగర్ యార్డుకు చేరుకుంది. 120 టన్నుల ద్రవరూప మెడికల్ ఆక్సిజన్ ఆరు ట్యాంకర్లలో ఒడిశా రాష్ట్రం కలింనగర్ నుంచి వచ్చింది.
ఆక్సిజన్ రవాణాకు చర్యలు
భారతీయ రైల్వే ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ను గ్రీన్ కారిడార్లను ఏర్పాటుచేసి గంటకు సుమారు 60 కిలోమీటర్ల వేగంతో రెండు రైళ్లను నడుపుతోంది. వివిధ రాష్ట్రాలకు క్రయోజనిక్ కార్గో ద్వారా ఆక్సిజన్ రవాణాకు తగిన చర్యలు తీసుకున్నామని రైల్వేశాఖ వెల్లడించింది. ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు వీలైనంత త్వరగా గమ్యస్థానానికి చేరుకోవడానికి అవసరమైన అన్ని సదుపాయాలను కల్పిస్తూ రవాణాను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి ఏడో ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైలు 55.42 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ తీసుకొచ్చేందుకు నాలుగు ఖాళీ కంటెయినర్లతో ఒడిశాకు బయలుదేరి వెళ్లింది.
ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్రయాణానికి ఎలాంటి అవాంతరాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని రైల్వేశాఖ స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: నేడు రాష్ట్రంలో కొవాగ్జిన్ టీకా రెండో డోసు నిలిపివేత