గతేడాది కొవిడ్ రోగులకు సేవలు అందిస్తూ... వైరస్‌తో మృతి చెందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీఎంహెచ్‌వో డాక్టర్ నరేష్ భార్య పావనికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తూ ప్రత్యేక జీవో విడుదల చేశారు. ఈ మేరకు మంత్రి ఈటల రాజేందర్... ఆమె కుటుంబసభ్యులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, తెలంగాణ పబ్లిక్ హెల్త్ వైద్యుల సంఘం ప్రతినిధుల ఆధ్వర్యంలో జీవో కాపీని అందించారు.
గెజిటెడ్ ఉద్యోగం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి ఈటల రాజేందర్‌కు... పావని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకోసం కృషి చేసిన సంఘం ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. కష్టపడి పనిచేసి... ప్రభుత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆమె పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'ఉద్యోగాలివ్వండి.. లేదంటే కారుణ్య మరణాలకు అనుమతివ్వండి'