ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రతపై ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదల చేసింది. అధికారుల కమిటీ రూపొందించిన మార్గదర్శకాలకు ఆమోదం తెలిపిన సీఎం కేసీఆర్... సదరు దస్త్రంపై సంతకం చేశారు. ఉద్యోగ భద్రత కల్పిస్తామని గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ మార్గదర్శకాలకు ఆమోదం తెలిపారు.
విధి నిర్వహణలోని సమస్యలను ఆర్టీసీ ఉద్యోగులు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. పలు సందర్భాల్లో వేధింపులకు గురవుతున్నామన్న ఉద్యోగులు... కొన్నిసార్లు ఉద్యోగాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల అభ్యర్థనలను ఆలకించిన సర్కారు... వారి భద్రతకు మార్గదర్శకాలు రూపొందించింది.