ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ సీఎం డీజీ సాయి ప్రసాద్‌కు ఏపీ జెన్కో ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకూ సాయి ప్రసాద్‌ను జెన్కో ఎండీ బాధ్యతల్లో కొనసాగాల్సిందిగా ప్రభుత్వం పేర్కొంది.
ఈ మేరకు ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆ స్థానంలో పని చేస్తున్న శ్రీధర్.. వ్యక్తిగత కారణాలతో సెలవుపై వెళ్లిన కారణంగా సాయి ప్రసాద్‌కు ఏపీ జెన్కో సీఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఇవీ చూడండి: కొవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్‌కు వాలంటీర్ల ఉత్సాహం