రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు10శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుపై రెండు, మూడు రోజుల్లోనే ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, ఆదేశాలు జారీచేయనున్నట్లు కేసీఆర్ తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు.. విద్య, ఉద్యోగ అవకాశాల్లో 10శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ప్రస్తుత రిజర్వేషన్లు యథావిధిగా కొనసాగిస్తూనే ఈడబ్ల్యూఎస్ కోటాలో.. పదిశాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే బలహీనవర్గాలకు 50 శాతం మేర రిజర్వేషన్లు అమలు అవుతున్నాయని... ఈడబ్ల్యూఎస్ కలిపితే ఇకపై 60 శాతం రిజర్వేషన్లు అమలవుతాయని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: త్వరలోనే.. ముఖ్యమంత్రిగా కేటీఆర్ బాధ్యతలు: పద్మారావు గౌడ్