ETV Bharat / city

సమాచార కమిషనర్లను నియమించిన ప్రభుత్వం

information commission
information commission
author img

By

Published : Feb 10, 2020, 8:23 PM IST

Updated : Feb 10, 2020, 8:49 PM IST

20:21 February 10

సమాచార కమిషనర్లను నియమించిన ప్రభుత్వం

       సమాచార కమిషనర్లుగా కొత్తగా ఐదుగురు నియమితులయ్యారు. కట్టా శేఖర్ రెడ్డి, గుగులోత్ శంకర్ నాయక్, సయ్యద్ ఖలీలుల్లా, నారాయణరెడ్డి, మహ్మద్ అమీర్​లను కమిషనర్లుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సమాచార కమిషనర్ల ఎంపిక కోసం ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి ప్రశాంత్ రెడ్డి, మజ్లిస్ శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీతో కూడిన కమిటీ సమావేశమైంది. వచ్చిన దరఖాస్తుల్లో నుంచి కమిషనర్ల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది.  

       కమిటీ సిఫారసులకు అనుగుణంగా ఐదుగురిని సమాచార కమిషనర్లుగా గవర్నర్ తమిళిసై నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కమిషనర్లు మూడేళ్లు లేదా 65 ఏళ్ల వయసు వచ్చే వరకు పదవిలో ఉంటారు. ప్రస్తుతం ప్రధాన సమాచార కమిషనర్ రాజాసదారాంతో పాటు మరో కమిషనర్ బుద్ధా మురళి ఉన్నారు. వారికి అదనంగా ఐదుగురు సమాచార కమిషనర్లుగా నియమితులయ్యారు. 

Last Updated : Feb 10, 2020, 8:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.