ETV Bharat / city

కొత్త జిల్లాలకు మార్చి 11కల్లా సిబ్బంది ఖరారు.. ఏప్రిల్‌ 2 నుంచి..

కొత్త జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపు, పోస్టుల విభజనకు మార్గదర్శకాలు

author img

By

Published : Feb 27, 2022, 1:56 PM IST

13:38 February 27

కొత్త జిల్లాలకు మార్చి 11కల్లా సిబ్బంది ఖరారు.. ఏప్రిల్‌ 2 నుంచి..

New Districts: ఏపీలో జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా ఉద్యోగుల కేటాయింపు, పోస్టుల విభజనకు సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కొత్త జిల్లాల్లో ఈ కేటాయింపులకు సంబంధించి ఇప్పటికే ఉద్యోగులకు ఆప్షన్ ఫార్మ్​లను జారీ చేసింది. సీఎస్ నేతృత్వంలోని రాష్ట్ర స్థాయి కమిటీ వీటిని పరిశీలించి, తుది నిర్ణయం తీసుకోనుంది. ఏప్రిల్ 2 ఉగాది నాటి నుంచి కొత్త జిల్లాల్లోని పునర్ వ్యవస్థీకరించిన ప్రభుత్వ కార్యాలయాలు, రెవెన్యూ డివిజన్లు పని చేయడం ప్రారంభిస్తాయని ప్రభుత్వం పేర్కొంది.

ఏప్రిల్ 2ను జిల్లాల పునర్వవస్థీకరణకు సంబంధించి అపాయింటెడ్ డేగా పేర్కొంటూ ప్రభుత్వ ఆదేశాలిచ్చింది. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా వనరులు, ఉద్యోగుల శాశ్వత విభజనకు కొంత సమయం పడుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రభుత్వం కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లలో ప్రభుత్వ విధులు సాఫీగా జరిగేందుకు తాత్కాలికంగా ఉద్యోగులు, పోస్టులు, వనరుల కేటాయింపు అవసరమని స్పష్టం చేసింది.

తాత్కాలిక కేటాయింపుల కోసం రాష్ట్ర, ప్రాంతీయ, జోనల్, మండల, గ్రామ స్థాయిలోని కార్యాలయాలు, పోస్టుల విభజన, కేటాయింపు ఉండబోదని స్పష్టం చేసింది. జిల్లా, డివిజన్ స్థాయిలోని ఉద్యోగులను మాత్రమే తాత్కాలిక ప్రాతిపదికన కేటాయింపు ఉంటుందని వెల్లడించింది. ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపుల అంశాన్ని ఆర్ధిక శాఖ పర్యవేక్షిస్తుందని పేర్కొన్న ప్రభుత్వం.. కొత్త జిల్లాలకు ఆర్డర్ టు సర్వ్ పేరిట తాత్కాలిక కేటాయింపు ఉత్తర్వులు జారీ అవుతాయని స్పష్టం చేసింది.

ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వుల తర్వాత ఉద్యోగులు ఒకచోట నుంచి మరో చోటుకు వెళ్లే అవకాశమున్నందున.. బదిలీలపై నిషేధం ఉత్తర్వులను సడలించనున్నట్టు తెలిపింది. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తాత్కాలిక ప్రాతిపదికనే కొత్త జిల్లాలకు కేటాయించనున్నట్టు స్పష్టం చేసింది. ఏపీ పోలీసు విభాగం మినహా మిగతా ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులు కొత్త జిల్లాలు, డివిజన్లకు అనుగుణంగా మార్పు చేర్పులు ఉంటాయని తెలిపింది.

మార్చి 11 తేదీ నాటికి ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపుల జాబితా సిద్ధమవుతుందని పేర్కొన్న ప్రభుత్వం.. తుది జాబితాకు అనుగుణంగా ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు స్పష్టం చేస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది.

ఇదీ చదవండి: 'పోలియో రహిత దేశం కోసం అందరూ భాగస్వాములు కావాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.