ETV Bharat / city

Green India Challenge: గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​లో పాల్గొన్న గోరటి వెంకన్న, జూలూరి గౌరీశంకర్​ - కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత గోరటి వెంకన్న

Green India Challenge: గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా... కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత గోరటి వెంకన్న, తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్​ జూలూరి గౌరీశంకర్​ మొక్కలు నాటారు. హైదరాబాద్​ రవీంద్రభారతిలో మొక్కలు నాటిన వీరు.. సాహితీమూర్తులందరూ ఈ ఉద్యమంలో పాల్గొనాలని కోరారు.

Gorati Venkanna and Juluri Gaurishankar participated in the Green India Challenge

author img

By

Published : Jan 5, 2022, 5:06 AM IST

Green India Challenge: అక్షరాలను పూయించే కవులు, రచయితలు అడవుల పెంపకంలో భాగంగా మొక్కలు నాటే ఉద్యమంలో పాలుపంచుకోవాలని కవి గోరటి వెంకన్న, తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్​ జూలూరు గౌరీశంకర్ కోరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా వనజీవి రామయ్య విసిరిన ఛాలెంజ్​ను స్వీకరించిన గోరటి, జూలూరి.. రవీంద్రభారతి ప్రాంగణంలో మొక్కలు నాటారు. ప్రకృతిని చూసి పరవసించి కవితలు, పాటలు, నవలలు, కథలయ్యే రచయితలందరూ పర్యావరణ పరిరక్షణలో ముందుండాలని వారు విజ్ఞప్తి చేశారు.

సృజనశీలులైన సాహితీమూర్తుల మూలాలన్నీ పర్యావరణంలోని ప్రతి మొక్కలో, ఆకులో, పిందెలో, మొలకెత్తే విత్తనంలో ఉంటాయని గోరటి గుర్తుచేశారు. మానవజాతిని, భూమండలాన్ని రక్షించే ప్రకృతిమాత రుణం తీర్చుకునే బిడ్డలుగా ప్రతి మనిషి ఒక మొక్కను నాటాలని.. వాటిని సంరక్షించే బాధ్యత చేపట్టాలని కోరారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని మహోద్యమంగా మరింత ముందుకు తీసుకుపోవటంలో సాహిత్య సాంస్కృతిక కళారంగాలు కదలిరావాలన్నారు.

రాష్ట్రం వచ్చాక అడవులు 6 శాతం పెరిగాయని జూలూరి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చేపట్టిన హరితహారం దేశానికే ఆదర్శప్రాయంగా నిలుస్తుందన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్​తో రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ చేస్తున్న ఉద్యమం తెలంగాణకు ఆదర్శప్రాయమైందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సహ వ్యవస్థాపకుడు రాఘవేంద్ర యాదవ్, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, రామానంద తీర్థ గ్రామీణ విద్యాసంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్. కిషోర్, మారగాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.