సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి బంగారు చీరను సమర్పించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. మాసాబ్‌ట్యాంక్‌లోని కార్యాలయంలో.. వేడుకల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
17వ తేదీన ఉదయం 6గంటలకు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం, 9గంటలకు మృత్యుంజయ హోమం, అన్నదానం వంటి పలు కార్యక్రమాలను నిర్వహిస్తామని మంత్రి పేర్కొన్నారు. దాతల సహకారంతో తయారు నేయించిన రెండున్నర కిలోల బంగారు చీరను అమ్మవారికి సమర్పించనున్నట్లు వివరించారు.
అలాగే సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో.. 15 నుంచి 17వ తేదీ వరకు కోటి కుంకుమార్చన, ఆయుష్షు హోమం, తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. అనంతరం పూజల్లో పాల్గొన్న 250మంది మహిళలకు చీరలను పంపిణీ చేస్తామని ప్రకటించారు.
ఈ సమావేశంలో కార్పొరేటర్లు అరుణా గౌడ్, శేషుకుమారి, బల్కంపేట ఎల్లమ్మ ఆలయ ఈవో అన్నపూర్ణ, ఉజ్జయిని మహంకాళి ఆలయ ఈవో మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: తెలంగాణలో రాజన్న రాజ్యం మళ్లీ తీసుకొస్తా: వైఎస్ షర్మిల