ETV Bharat / city

ktr: 'వ్యాక్సిన్​ హబ్​గా ఉన్నా.. గ్లోబల్​ టెండర్లు పిలవాల్సి వచ్చింది'

author img

By

Published : May 26, 2021, 5:01 PM IST

దేశంలో డిమాండ్​కు తగ్గ టీకాలు అందుబాటులో లేవని మంత్రి కేటీఆర్​ అన్నారు. హైదరాబాద్​ వ్యాక్సిన హబ్​గా ఉన్నా.. టీకాల కోసం గ్లోబల్​ టెండర్లు పిలవాల్సి వచ్చిందన్నారు. కొవిడ్​ కట్టడికి సమష్ఠిగా పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు.

ktr on global tenders
ktr speaks on global tenders

హైదరాబాద్ వ్యాక్సిన్ హబ్‌గా ఉన్నప్పటికీ టీకాల కోసం గ్లోబల్ టెండర్లు పిలవాల్సి వచ్చిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ అన్నారు. కోటి వ్యాక్సిన్‌ల కోసం ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు పిలిచినట్లు వెల్లడించారు. కేంద్రం మౌనంగా ఉండడం వల్లనే టీకాల కొరత వచ్చిందని విమర్శించారు. వీలైనన్ని వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలను తయారీకి ప్రోత్సహిస్తే.. అధిక మొత్తంలో కరోనా టీకాలు అందుబాటులోకి వస్తాయని కేటీఆర్​ అభిప్రాయపడ్డారు. కొవిడ్ విషయంలో ఐటీ రంగం సేవలను ఏవిధంగా వినియోగించుకోవాలనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.

మాదాపూర్‌లో.. సైబరాబాద్ పోలీసులు, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, యునైటెడ్‌ వే ఆఫ్ హైదరాబాద్, ఐటీ ఉద్యోగులు సంయుక్తంగా ఏర్పాటు చేసిన.. ఆశ్రయ్‌ ఉచిత కొవిడ్ కేర్‌ సెంటర్‌ను మంత్రి కేటీఆర్​ ప్రారంభించారు. సాధారణ లక్షణాలు ఉన్న వారికే ఈ ఆశ్రయ్‌ సెంటర్‌లో చికిత్స అందిస్తున్నారని వివరించారు.

వ్యాక్సిన్​ హబ్​గా ఉన్నా.. గ్లోబల్​ టెండర్లు పిలవాల్సి వచ్చింది: కేటీఆర్​

ఇవీచూడండి: కరోనా విపత్కర వేళ సమ్మెకు పిలుపునివ్వడం సరికాదు: కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.