చదువు, విజ్ఞానం పరంగా ముందున్నా.. కొన్ని రకాల స్కిల్స్‌పరంగా అమ్మాయిలు వెనకే ఉన్నారంటున్నాయి కొన్ని రకాల అధ్యయనాలు. విదేశీ విద్య అయినా, ఉద్యోగమైనా.. సంస్థలు దరఖాస్తుల్లో కొన్ని నైపుణ్యాల కోసం చూస్తుంటాయి. వాటిని ముందస్తుగానే అందుకోవడం తప్పనిసరి.
- హార్డ్ స్కిల్స్..
వీటినే టెక్నికల్ స్కిల్స్ అనీ పిలుస్తారు. ఎంచుకున్న విభాగమేదైనా వీటిని అందిపుచ్చుకోవాల్సిందే. అయితే అవి సాధారణంగా ఏ రెజ్యూమె చూసినా కనిపించేవి అయ్యుండకూడదు. పరిశ్రమకు సంబంధించినవైతే మంచిది.
- తోటి వాళ్లతో కలిసిపోవడం..
సంస్థ అయినా విశ్వ విద్యాలయమైనా చూసే ప్రధాన లక్షణం ఇదే. కాబట్టి, భాషా నైపుణ్యాలతోపాటు ధైర్యంగా మాట్లాడే, సులువుగా కలిసిపోయే పద్ధతినీ అలవరచుకోవాలి. కళాశాల కమిటీలు, సెమినార్లు వంటి వాటిల్లో పాల్గొంటే ఈ నైపుణ్యాలు సులువుగా వస్తాయి.
- మొక్కుబడిగా వద్దు..
చదువుతూనే పని వాతావరణం గురించి తెలుసుకునే అవకాశాన్ని ఇంటర్న్‌షిప్‌లు అందిస్తాయి. వీటిని మొక్కుబడిగానో కాకుండా సీరియస్‌గా చేయండి. నిజంగా నేర్చుకునే అవకాశం వీటిద్వారానే కలుగుతుంది.
- సమయానికి అనుగుణంగా ప్రవర్తించడం..
దీన్నే ట్రాన్ఫరబుల్ స్కిల్‌గానూ చెప్పొచ్చు. పరిస్థితిని బట్టి.. మల్టీటాస్కింగ్, బృందాన్ని నడిపించగలగడం, త్వరగా స్పందించగలగడం, త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడం వంటివి అలవాటు చేసుకోవాలి.
ఇదీ చూడండి: సామాజిక మాధ్యమాలతో అమ్మాయిలు తస్మాత్ జాగ్రత్త!!