ఏపీ కడప జిల్లా మైలవరంలో తొమ్మిది సంవత్సరాల బాలికపై అత్యాచారం జరిగింది. గ్రామంలో వీఆర్ఏగా విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి... చిన్నారిపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు మైలవరం ఎస్.ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ప్రొద్దుటూరు ఆస్పత్రికి తరలించారు.
ఇవీచూడండి: కాంట్రాక్ట్ డాక్టర్‌పై అత్యాచారం కేసు నమోదు