ETV Bharat / city

Viral video: 'పెళ్లి చేసుకోనన్న ప్రియుడు.. ఆమె ఎంత పని చేసిందంటే..!' - girl beat her boyfriend for cheating

Viral video: తనను పెళ్లి చేసుకోవాలని.. ఓ యువతి ప్రేమికుడిని రోకలితో చితకబాదిన ఘటన ఏపీలోని కర్నూలు జిల్లాలో జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుంటానని మొహం చాటేశాడని ఆగ్రహానికి గురైన యువతి.. ప్రియుడిని తాళి కట్టాలని డిమాండ్ చేస్తూ చితకబాదిన వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

Viral video
ప్రేమికుడిని రోకలితో చితకబాదిన యువతి
author img

By

Published : Feb 22, 2022, 3:33 PM IST

Updated : Feb 22, 2022, 3:46 PM IST

Viral video: ప్రేమించి మోసం చేసే యువకులకు ఓ చక్కని గుణపాఠం చెప్పింది ఏపీలోని కర్నూలుకు చెందిన యువతి. తనను పెళ్లి చేసుకుంటావా లేదా అని నలుగురిలో ప్రియుడిని నిలదీసింది. అంతటితో ఆగకుండా కర్ర తీసుకుని బడితె పూజ చేసింది. తాళి కడతావా.. చస్తావా అంటూ చితకబాదింది.

జిల్లాలోని పెద్దటేకూరుకు చెందిన ఓ యువతిని కల్లూరు మండలం చిన్న టేకూరుకు చెందిన ఓ యువకుడు ప్రేమించాడు. ఆ యువతి పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి మొహం చాటేస్తున్నాడు. ప్రియుడి మోసంతో ఆగ్రహానికి గురైన యువతి తాళి కట్టాలంటూ స్థానికంగా ఉన్న ఓ దేవాలయంలో అందరిముందే అతన్ని కర్రతో చితకబాదింది. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.

కర్నూలు జిల్లా

ఇదీ చదవండి:

Last Updated : Feb 22, 2022, 3:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.