ETV Bharat / city

సీజనల్​ వ్యాధుల నివారణ చర్యలపై దృష్టి - ghmc

హైదరాబాద్ నగరంలో జీహెచ్‌ఎంసీ అధికారులు డెంగీ, సీజనల్ వ్యాధుల నివారణ చర్యలపై క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు.

సీజనల్​ వ్యాధుల నివారణ చర్యలపై దృష్టి
author img

By

Published : Sep 18, 2019, 11:56 PM IST

హైదరాబాద్​ న‌గ‌రంలో పారిశుద్ధ్య కార్యక్రమాల అమలు, సీజనల్ వ్యాధుల నివారణ చర్యలపై ప‌లు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్లు, విభాగాధికారులు ఆక‌స్మికంగా త‌నిఖీలు నిర్వహించారు. సీజనల్ వ్యాధులను కలిగించే శానిటేషన్ కార్యక్రమాలు, దోమల నివారణ, లార్వా ఉత్పత్తికి కారణమయ్యే నీటి నిల్వల తొలగింపు, త‌దిత‌ర అంశాలే ల‌క్ష్యంగా ఈ క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టారు. ఉదయం ఆసిఫ్ నగర్, విజయనగర్ కాలనీలలో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణను అడిషనల్ కమిషనర్ అద్వైత్ కుమార్ సింగ్ తనిఖీ చేశారు. అంబర్ పేట్ సర్కిల్ లోని నారాయణగూడ, హైదర్ గూడ, చిక్కడపల్లి, గాంధీనగర్ తదితర ప్రాంతాల్లో అడిషనల్ కమిషనర్ సిక్తాపట్నాయక్ పర్యటించి పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణను పరిశీలించారు. అడిషనల్​ కమిషనర్లు సందీప్​ ఝూ, జయరాజ్​ కెనడీ, జోనల్ కమిషనర్లు ముషారఫ్ అలీ, ఎస్. శ్రీనివాస్ రెడ్డి, శంకరయ్య, శ్రీనివాస్ రెడ్డి, మమతలు తమ ప్రాంతాల్లో ఉదయం నుంచి విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు.

ఇవీ చూడండి: త్వరలో ఆస్పత్రుల్లో ఖాళీల భర్తీ: ఈటల

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.