'నమ్మకం నిలబెట్టుకున్నందుకు ఈసారి కూడా తెరాసదే పీఠం' - trs campaign in hyderabad
గ్రేటర్‌లో అభివృద్ధి చేస్తామన్న నమ్మకంతో 99 స్థానాలు గెలిచామని.. మాట నిలబెట్టుకున్నందుకు ఈసారి 100 సీట్లకు పైగా గెలుస్తామని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో అగ్రపథాన నిలిపామని బొంతు రామ్మోహన్ వివరించారు. ప్రజల ప్రాథమిక అవసరాలకు పెద్దపీట వేశామని పేర్కొన్నారు. మురుగునీటి పారుదల వ్యవస్థ మెరుగుపరచామని వెల్లడించారు. ఉద్యానవనాల ఏర్పాటు, మూసీ ప్రక్షాళనకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రణాళికలో చేర్చని పనులను సైతం చేశామంటున్న రామ్మోహన్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ghmc mayor bonthu rammohan interview on greater elections
ఇదీ చూడండి: అభివృద్ధి రాజకీయం కావాలా?.. విభజనవాదం కావాలా?