ETV Bharat / city

నేడు జీహెచ్​ఎంసీ స్టాండింగ్​ కమిటీ ఎన్నికలకు నోటిఫికేషన్​

author img

By

Published : Jun 5, 2020, 5:15 AM IST

Updated : Jun 5, 2020, 5:34 AM IST

నేడు జీహెచ్‌ఎంసీ కొత్త స్టాండింగ్ కమిటీ ఎంపికకు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలకానుంది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్​కుమార్ అందుకు సంబంధించిన షెడ్యూల్​ను ప్రకటించారు.

GHMC Election Notification will be Released Today
నేడు విడుదల కానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్‌

జీహెచ్‌ఎంసీ కొత్త స్టాండింగ్ కమిటీ ఎంపికకు నేడు ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనుంది. అందుకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్​ను జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్​కుమార్ విడుదల చేశారు. ఈనెల 10వ తేదీ నుంచి 18 వరకు నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. 29న పోలింగ్ నిర్వహించి అదే రోజు కౌంటింగ్ ఉంటుందని షెడ్యూల్లో వివరించారు. ఈ ఎన్నికలో 15 మంది సభ్యులను స్టాండింగ్ కమిటీకి ఎన్నుకుంటారని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈనెల 10వ తేది నుంచి 18 వరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.

దాఖలైన నామినేషన్ల వివరాలను 19న వెల్లడిస్తారు. 20న ఉదయం 11 నుంచి 12 గంటల వరకు నామినేషన్ల స్క్రూట్నీ ఉంటుంది. ఈనెల 23న సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ అనంతరం తుది జాబితాను ప్రకటిస్తారు. 29న జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉదయం 10 నుంచి 3 గంటల వరకు పోలింగ్ నిర్వహించి లెక్కింపు చేపట్టనున్నట్లు ఎన్నికల షెడ్యూల్లో వెల్లడించారు.

ఇదీ చూడండి : రాష్ట్రంలో కొత్తగా 127 కరోనా పాజిటివ్ కేసులు

Last Updated : Jun 5, 2020, 5:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.