ETV Bharat / city

గ్రేటర్​లో​ కరోనా విలయ తాండవం.. భారీగా పెరిగిన కేసులు - జీహెచ్​ఎంసీలో కరోనా

గ్రేట‌ర్ హైద‌రాబాద్​లో క‌రోనా వైరస్​ విలయతాండవం చేస్తుంది. ప్రతి రోజు న‌గ‌రంలో పెద్ద సంఖ్యలో కొవిడ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. వైర‌స్ క‌ట్టడికి బ‌ల్దియా ఎన్ని చర్యలు తీసుకున్నా.. కేసులు మాత్రం అదుపులోకి రావ‌డం లేదు. కరోనా తీవ్రత దృష్ట్యా ఆదివారం జంటనగరాల ప‌రిధిలో నిర్వహించే బోనాల పండ‌గ‌ను ఇళ్లలోనే జ‌రుపుకోవాల‌ని ప్రభుత్వం ప్రజలను కోరింది.

గ్రేటర్​ కరోనా విలయ తాండవం.. భారీగా పెరిగిన కేసులు

author img

By

Published : Jul 18, 2020, 9:15 PM IST

రాష్ట్ర రాజధానిలో శనివారం కూడా కరోనా కేసులు భారీగా న‌మోద‌య్యాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో 44 మందికి కొవిడ్ నిర్థరణ అయిన‌ట్లు అధికారులు వెల్లడించారు. మల్కాజ్​గిరి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో 240 మందికి పరీక్షలు నిర్వహించ‌గా... 61 మందికి పాజిటివ్ వ‌చ్చింది. మ‌ల్కాజ్​గిరిలోని 55 ఏళ్ల వ్యక్తి ఓ ప్త్రెవేటు ఆస్పత్రిలో క‌రోనా చికిత్స పొందుతూ మృతి చెందిన‌ట్లు అధికారులు తెలిపారు.

17 మంది మృతి..

గచ్చిబౌలిలోని కొండాపూర్​లో 44, మూసాపేట్​లో 23, కూకట్​పల్లి సర్కిల్​లో 65, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో 44 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సూరారంలో 5, షాపూర్ నగర్​లో 19, గాజులరామారంలో 13 మందికి పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు అధికారులు తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటివరకు 1004 కేసులు నమోదవ్వగా.. 17 మంది మృతి చెందారు.

నార్త్ జోన్ పరిధిలో 67..

ఉప్పల్ సర్కిల్​లో శనివారం 54 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 171 మందికి ర్యాపిడ్ పరీక్షలు చేయగా 34 మందికి పాజిటివ్ వచ్చింది. ఇతర ల్యాబ్ లలో పరీక్షలు చేయించుకున్న వారిలో 20 మందికి పాజిటివ్ వచ్చిన‌ట్లు అధికారులు తెలిపారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో ఒక్కరోజే కొత్తగా 68 మందికి కరోనా పాజిటివ్ వ‌చ్చింది. మేడ్చల్ ప్రభుత్వాసుపత్రిలో నిర్వహించిన పరీక్షలో పదిమందికి పాజిటివ్ వచ్చింది. సికింద్రాబాద్ నార్త్ జోన్ పరిధిలో 67 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యాధికారి నాగార్జున తెలిపారు. కంటోన్మెంట్ తాడ్​బండ్​లో తొమ్మిది మందికి పాజిటివ్ వచ్చింది.

ఉపసభాపతికి నెగిటివ్​..

ఎస్​ఆర్​ న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్​లో మ‌రో ఇద్దరు కానిస్టేబుళ్లకు వైర‌స్ సోకింది. ఈ ఒక్క పీఎస్​లోనే ఇప్పటి వ‌ర‌కు 27 మంది పోలీసుల‌కు పాజిటివ్ వ‌చ్చింది. గతంలో కరోనా పాజిటివ్ వచ్చిన శాసనసభ ఉపసభాపతి పద్మారావుకు తాజా పరీక్షల్లో నెగెటివ్​గా తేలింది. కరోనా తీవ్రత దృష్ట్యా ఆదివారం జంటనగరాల ప‌రిధిలో నిర్వహించే బోనాల పండ‌గ‌ను ఇళ్లలోనే జ‌రుపుకోవాల‌ని ప్రభుత్వం ప్రజలను కోరింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.