ఇతర దేశాలు, రాష్ట్రాలు, నగరాలకు వెళ్లినప్పుడు గమ్యాన్ని సులువుగా చేరుకునేలా.. నిర్ధేశిత గమ్యానికి కేవలం మీటర్ కచ్చితత్వంతో వెళ్లేలా టీహెచ్- కోడ్ యాప్ అందుబాటులోకి వచ్చింది. చెన్నైలోని క్రెసెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో రీసెర్చ్ విభాగ అధిపతి తిరుమలశెట్టి హరినారాయణ తన స్టూడెంట్ పీతాంబర్ సాయంతో ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. గతంలో జర్మీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలకు డైరెక్టర్ జనరల్‌గా పనిచేసిన హరినారాయణకు ఎదురైన స్వీయ అనుభవాలతో ఈ యాప్‌ను తయారు చేసినట్లు చెబుతున్నారు.
కచ్చితమైన లోకేషన్‌కు వెళ్లేందుకు..
"ఈ యాప్ వల్ల ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా... నిర్దేశిత గమ్యస్థానానికి అత్యంత సులువుగా చేరుకోవచ్చు. ఈ యాప్‌లో అందుబాటులో ఉండే ఎనిమిది అంకెల ప్రత్యేక కోడ్ సహాయంతో సులువుగా గమ్యం చేరుకునే వీలుంది. ఎవరైనా మన ఇంటి వద్దకు రావాలన్నా... ఎక్కడైనా వేరే చోట ఉన్న వ్యక్తిని కలుసుకోవాలన్నా... ఆ ఎనిమిది అంకెల సంఖ్యను యాప్‌లో నమోదు చేస్తే సరిపోతుంది. నేరుగా గమ్యానికి తీసుకెళ్తుంది. ఒక్క మీటర్ అక్కురసీతో గమ్యం చేరేలా.. అక్షాంశాలు, రేఖాంశాల విలువల ఆధారంగా ఈ యాప్‌ను తయారు చేశాం. జీపీఎస్ లొకేషన్లో యాభై నుంచి వంద మీటర్ల వరకు గమ్యస్థానాన్ని తప్పుగా చూపిస్తోంది. ఈ యాప్ వల్ల అలాంటి సమస్యలకు తావు లేకుండా.. ఎగ్జాక్ట్ లొకేషన్‌కు వెళ్లొచ్చు. వినియోగదారులకు అత్యంత వినియోగకరంగా తీర్చిదిద్దాం. చాలా సులువుగా దీన్ని వినియోగించవచ్చు. టీహెచ్- కోడ్ యాప్ ఇప్పుడు గూగుల్స్టోర్లో అందుబాటులో ఉంది." - తిరుమలశెట్టి, టీహెచ్-కోడ్ యాప్ రూపకర్త.
యాప్ తయారుచేసినందుకు గానూ... కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 10 లక్షల గ్రాంటు అందుకున్నాని తిరుమల శెట్టి చెప్పారు. త్వరలో స్టార్టప్ ప్రారంభించి.. మరిన్ని సరికొత్త యాప్‌లను తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు.
ఇదీచూడండి: