గ్రేటర్ హైదరాబాద్ సహా పట్టణ ప్రాంతాల్లో చేపట్టిన రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు గృహనిర్మాణ శాఖ రూ. 600 కోట్లు విడుదల చేస్తూ... ఉత్తర్వులు జారీ చేసింది.
బడ్జెట్లో రూ. 3850కోట్లు కేటాయించగా... గతంలో రూ. 150 కోట్లు విడుదల చేశారు. తాజాగా మరో రూ. 600 కోట్లు విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.
ఇదీ చూడండి: 'రెండు పడకల గదుల ఇళ్లను అమ్ముకునే వారిపై కేసులు'