ETV Bharat / city

మూడోతరగతిలో క్యాలెండర్‌ గుర్తించేవారు 58 శాతమే! - నివేదికలు

Learning Study Report 2022 ఆంధ్రప్రదేశ్​లో ఫౌండేషనల్​ లెర్నింగ్​ స్టడీ సంస్థ చేసిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోనికి వచ్చాయి. రాష్ట్రంలో మూడో తరగతి విద్యార్థులుపై సర్వే చేసిన ఆ సంస్థ విద్యార్థులకు సంబంధించి పలు అంశాలపై సర్వే చేసింది. ఇందులో 65% మంది పిల్లలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారని పేర్కొంది. అంతే కాకుండా విద్యార్థుల్లో వారి పఠన నైపుణ్యం వారి మౌలిక వసతులుపై ఈ సంస్థ సర్వే చేసి తన రిపోర్టు సమర్పించింది.

Learning Study Report
Learning Study Report
author img

By

Published : Sep 8, 2022, 12:05 PM IST

Learning Study Report 2022 :ఆంధ్రప్రదేశ్​లో మూడోతరగతి చదువుతున్న విద్యార్థుల్లో 58% మంది క్యాలెండర్‌లోని నెల, తేదీ, రోజును సరిగా గుర్తించినట్లు కేంద్రం బుధవారం విడుదల చేసిన పునాది అభ్యసన అధ్యయనం-22 (ఫౌండేషనల్‌ లెర్నింగ్‌ స్టడీ) వెల్లడించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు, కేంద్రీయ విద్యాలయాల్లో చదువుతున్న మూడో తరగతి విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు తెలుగు, ఆంగ్లం, ఒడియా, కన్నడ, ఉర్దూ భాషలు, గణితం సబ్జెక్టులపై కేంద్ర విద్యాశాఖ ఈ అధ్యయనం నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా ఆంగ్లభాషలో 155 పాఠశాలల్లో 1,456 మంది, తెలుగుభాషలో 102 బడుల్లో 857 మంది విద్యార్థులకు పలు అంశాలపై పరీక్షలు నిర్వహించింది.

క్యాలెండర్‌లోని నెల, తేదీ, రోజును 58% సరిగ్గా చెప్పారు. వేరేవారి సాయంతో 22% మంది చెప్పగా, 6% తప్పులు చెప్పారు, 14% అసలు సమాధానం చెప్పలేకపోయారు. కొలతలు, సమయాలపై ఇచ్చిన కూడికలు, తీసివేతల్లో కొంత వెనుకబడినట్లు ఈ సర్వే తెలిపింది. ఆంగ్ల భాషలో ఇచ్చిన 50 పదాల్లో సగటున 36 (72%) పదాలను తప్పులు లేకుండా చదవగలిగారు. 80%పైగా పదాలను సరిగా చదవగలిగినవారు 63% ఉండగా.. 50-80% చదవగలిగినవారు 17% ఉన్నారు. తెలుగుభాషలో జాతీయ సగటు కంటే రాష్ట్రం ముందువరసలో నిలిచింది.

80-100 తెలుగు అక్షరాలను సక్రమంగా చదివినవారు 74% ఉండగా.. తప్పులు చదివి, వాటిని తామే సరిచేసుకుని 10-49 అక్షరాలు చదివినవారు 8% ఉన్నారు. విద్యార్థులకు 50 పదాలు ఇవ్వగా.. స్పష్టంగా సరాసరిన 34 పదాలను చదవగలిగారు. 80% పదాలను సక్రమంగా చదివినవారు 55% ఉన్నారు. మిగతావారు తడబాటుకు గురవుతూ.. తప్పులను సరిచేసుకుంటూ చదివారు.

50 శాతంపైన బడికి కాలినడకే

మూడోతరగతి చదివేవారిలో పాఠశాలలకు నడిచి వచ్చేవారు 55% ఉండగా.. సైకిళ్లపై వచ్చేవారు 9%. ప్రజారవాణాలో వచ్చేవారు 8% కాగా.. సొంత వాహనాల్లో వస్తున్నవారు 21% ఉన్నారు.

* 65% మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారే

* 40% బడుల్లోనే మెడికల్‌ గది సదుపాయం ఉంది

* 51% పాఠశాలల్లోనే దివ్యాంగులకు అనుకూలమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయి.

* ఆంగ్లంలో 72% పదాలు తప్పులు లేకుండా చదువుతున్నారు

* తెలుగులో జాతీయ సగటు కంటే రాష్ట్రం ముందంజ

* కేంద్రం విడుదల చేసిన పునాది అభ్యసన అధ్యయనం-22లో వెల్లడి

.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.