సృష్టి రూపాలు : వ్యవహారంలో బ్రహ్మదేవుడు సృష్టికర్తగా ప్రసిద్ధి పొందినప్పటికీ అతడిని సృష్టించింది, అతడికి సృష్టి చేసే శక్తిని ఇచ్చింది శివుడేనని ఆగమాలు చెబుతున్నాయి. విష్ణువు కూడా నిరంతరం పరమేశ్వరుడినే ధ్యానిస్తాడు. ఆయా సందర్భాల్లో తనలోని సృష్టి లక్షణాన్ని ప్రకటిస్తూ స్వామి ధరించిన అవతారాలివి.
సంహార రూపాలు : బోళాశంకరుడిగా అందరికీ వరాలు ఇవ్వటం మాత్రమే కాదు... అవసరమైతే తానే సంహరిస్తాడు కూడా. ఆ సందర్భాల్లో స్వామి ధరించిన రూపాలే సంహార రూపాలు లేదా అవతారాలు.
స్థితి రూపాలు : పరమేశ్వరుడు చేసే ఆనందతాండవం నుంచే అక్షరాలతో సహా ప్రతి పాణికీ అవసరమైన శక్తి అందుతుంది. ఈ లక్షణాన్ని ప్రదర్శిస్తూ స్వామి ధరించిన రూపాలన్నీ స్థితిరూపాలుగా చెబుతారు..
అనుగ్రహ రూపాలు : శివుడు నిర్వహించే పంచకృత్యాల్లో చాలా తేలికైన విషయం ఇది. వరుసలో చివరిది కూడా. ఒక పనికి విఘ్నం కలిగించాలన్నా, ఆ విఘ్నాన్ని తీసేయ్యాలన్నా అది పరమేశ్వరుడి సంకల్పంపై ఆధారపడి ఉంటుంది. విఘ్న కర్త, హర్త కూడా ఆయనే.. ఈ లక్షణాన్ని ప్రదర్శిస్తూ పరమేశ్వరుడు ధరించిన అవతారాలివి..
తిరోధాన రూపాలు : తిరోధానం అంటే సృష్టిలోని చైతన్యాన్ని కొద్దికొద్దిగా వెనక్కు తీసుకోవటం. తన ద్వారా ఆవిర్భవించిన విశ్వం, అందులోని శక్తిని శివుడు నెమ్మదిగా తనలో లయం చేసుకుంటాడు పరమేశ్వరుడు.
- భిక్షాటనమూర్తి, వీరభద్రమూర్తి, కంకాలధారణమూర్తి, శరభమూర్తి, ఏకపాదమూర్తి
- లింగమూర్తి, లింగోద్భవమూర్తి, కల్యాణ సుందరమూర్తి, చంద్రశేఖరమూర్తి, గంగాధరమూర్తి
- జలంధరహరమూర్తి, త్రిపురసంహారమూర్తి, మన్మథ సంహారమూర్తి, గజసంహారమూర్తి, కాలసంహారమూర్తి
- సోమాస్కందమూర్తి, అర్ధనారీశ్వరమూర్తి, హరిహరమూర్తి, కిరాతమూర్తి, నటరాజమూర్తి
- చండేశానుగ్రహమూర్తి, విఘ్నప్రసాదమూర్తి, చక్రప్రదానమూర్తి, వృషారూఢమూర్తి, దక్షిణామూర్తి
ఇదీ చదవండి: రాజన్న ఆలయం ఈ విషయాలు తెలుసా?