ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలపై మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి స్పందించారు. ఓటర్లు అందరి వద్ద డబ్బులు తీసుకుని ఓటేస్తున్నారని పేర్కొన్నారు. ఏపీ పంచాయతీ ఎన్నికల్లో స్తోమత లేకున్నా ఆధిపత్యం కోసమే అభ్యర్థులు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో ఏపీ సీఎస్‌ను మారుమూలకు బదిలీ చేశారని అన్నారు. సీఎస్ బదిలీ తీరుపై ఐఏఎస్ అధికారులకు వణుకు పుడుతోందని దివాకర్ రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: ముగిసిన మంత్రివర్గ సమావేశం.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై చర్చ