ETV Bharat / city

సీఎం పర్యటనలో కేంద్ర మాజీ మంత్రి అలక

Former Union Minister Upset With AP CM : ఏపీ ముఖ్యమంత్రి జగన్​మోహన్​రెడ్డి పర్యటనలో.. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి అలిగారు. శ్రీకాకుళం ఆర్ అండ్ బీ అతిథి గృహం హెలీపాడ్ వద్దకు వచ్చిన కృపారాణి.. ప్రొటోకాల్ జాబితాలో తన పేరు లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ధర్మాన కృష్ణదాస్ సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా.. ఆమె శాంతించలేదు.

ముఖ్యమంత్రి పర్యటనలో కేంద్ర మాజీ మంత్రి అలక

author img

By

Published : Jun 27, 2022, 2:21 PM IST

ముఖ్యమంత్రి పర్యటనలో కేంద్ర మాజీ మంత్రి అలక

Former Union Minister Upset With AP CM : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి శ్రీకాకుళం పర్యటనలో ప్రొటోకాల్‌ వివాదం తలెత్తింది. ప్రొటోకాల్‌ జాబితాలో తన పేరు లేదంటూ కేంద్ర మాజీ మంత్రి, వైకాపా నేత కిల్లి కృపారాణి అలిగారు. ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహం వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ వద్దకు వచ్చిన కృపారాణి.. ప్రొటోకాల్‌ జాబితాలో పేరు లేకపోవడంపై అసంతృప్తికి గురయ్యారు. ఇదేమైనా న్యాయమా అంటూ అధికారులను నిలదీశారు.

‘నా పేరే మర్చిపోయారా..’ అంటూ ఆక్రోశం వ్యక్తం చేశారు. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌.. ఆమెను బుజ్జగించే ప్రయత్నం చేసినా.. ఆమె శాంతించలేదు. చివరకు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ స్వయంగా కృపారాణి కారు దగ్గరకు వెళ్లి బతిమిలాడారు. అయినా ఆమె శాంతించక.. అక్కడ నుంచి వెళ్లిపోయారు.

ఇవీ చూడండి.. రణరంగంగా పోడురైతుల పాదయాత్ర.. 200 మంది అరెస్ట్​..!

యశ్వంత్ సిన్హా నామినేషన్​.. 'ఇద్దరు వ్యక్తులు కాదు.. రెండు సిద్ధాంతాల మధ్య పోటీ!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.