ETV Bharat / city

Etela : దిల్లీ విమానాశ్రయంలో ఈటల బృందానికి తప్పిన ప్రమాదం - etela rajender reached Hyderabad from delhi

తెరాసను వీడి.. భాజపా తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్(Etela Rajender) తన అనుచరులతో కలిసి హైదరాబాద్​ చేరుకున్నారు. దిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న ఆయన.. నేరుగా తన నివాసానికి వెళ్లారు. త్వరలోనే భాజపా రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నట్లు ఈటల(Etela Rajender) సన్నిహితులు తెలిపారు.

etela rajender, etela rajender joined in bjp, etela rajender reached Hyderabad
ఈటల, ఈటల రాజేందర్, హైదరాబాద్​ చేరుకున్న ఈటల, భాజపాలో చేరిన ఈటల
author img

By

Published : Jun 15, 2021, 9:51 AM IST

Updated : Jun 15, 2021, 12:23 PM IST

భాజపాలో చేరిన తర్వాత తన అనుచరులతో కలిసి హైదరాబాద్​ బయలుదేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్(Etela Rajender) బృందానికి దిల్లీ విమానాశ్రయంలో స్వల్ప ప్రమాదం తప్పింది. టేకాఫ్ సమయంలో.. సాంకేతిక సమస్యను పైలట్ గుర్తించారు. సమస్యను పరిష్కరించిన అనంతరం విమానం నగరానికి బయలుదేరింది. ఉదయం 3 గంటలకు దిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకోవాల్సిన విమానం చాలా ఆలస్యంగా బయలుదేరింది.

etela rajender, etela rajender joined in bjp, etela rajender reached Hyderabad
నగరానికి చేరుకున్న ఈటల బృందం

తొలుత శంషాబాద్​కు ఉదయం 10 గంటలకు చేరుకుని.. అక్కణ్నుంచి నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయానికి భారీ ర్యాలీగా రావాలని భావించారు. అనుకున్న సమయానికి నగరానికి రాకపోవడం వల్ల ఈ కార్యక్రమం వాయిదా పడే అవకాశముంది. మరో రోజు పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లనున్నట్లు ఈటల(Etela Rajender) సన్నిహితులు తెలిపారు.

శంషాబాద్ విమానాశ్రయంలో ఈటల

దిల్లీ నుంచి హైదరాబాద్​ చేరుకున్న ఈటల బృందం

Last Updated : Jun 15, 2021, 12:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.