ETV Bharat / city

జనావాసాల్లోకి చిరుతలు రాకుండా ఇలా చేస్తాం.!

అటవీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి జంతువుల కదలికలను నిత్యం పర్యవేక్షిస్తున్నట్లు ఆ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్​రెడ్డి తెలిపారు. నీరు, ఆహారం వంటి ఏర్పాట్లు చేశామన్నారు.

indrakaran reddy
జనావాసాల్లోకి చిరుతల రాకపై మంత్రి ఏమన్నారంటే..!
author img

By

Published : Jun 7, 2020, 10:05 AM IST

Updated : Jun 7, 2020, 12:10 PM IST

అటవీ జంతువులు జనావాసాల్లోకి వస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్‌ శివారు కాటేదాన్‌లో చిరుత కలకలం రేపింది. నల్గొండలో మరో చిరుత వలకు చిక్కుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఓ గని వద్ద అటవీ మృగం కలకలం సృష్టించింది. వన్యమృగాలు అడవులను వీడి జనావాసాల్లోకి రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆ శాఖ మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి తెలిపారు. అటవీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి నిత్యం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. సోలార్​ పంపు సెట్లు ద్వారా నీరు అందుబాటులో ఉంచుతున్నట్లు చెబుతున్న అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో మా ప్రతినిధి శ్రీకాంత్‌ ముఖాముఖి..

ప్రశ్న: చిరుత పులులు అడవిని వదిలి జనావాసాల్లోకి ఎందుకు వస్తున్నాయి?

మంత్రి: లాక్​డౌన్​ వల్ల అంతా నిర్మానుష్యంగా మారడం వల్ల గ్రామాల సమీపంలోకి వస్తున్నాయి. నీరు ఆహారం కోసమే వస్తున్నాయి. సీసీ కెమెరాలు ఏర్పాటుచేశాం, జంతువుల కదలికలను పర్యవేక్షిస్తున్నాం. తనకు హాని జరగబోతుందని తలస్తేనే మనుషులపై దాడికి పాల్పడతాయి. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు.

ప్రశ్న: జంతువులు జనావాసాల్లోకి రాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ?

మంత్రి: సోలార్​ మోటార్లు ఏర్పాటుచేసి నీరు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నాం. మహారాష్ట్ర నుంచి నిపుణులను రప్పించి.. ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాల్లోని చాలా అటవీ ప్రాంతాల్లో గడ్డి పెరిగేలా చేశాం. వన్యమృగాలు జనావాసాల్లోకి వచ్చినప్పడు ఆవులు, ఇతర పెంపుడు జంతువులను చంపితే అందుకు తగిన పరిహారం చెల్లిస్తాం.

ప్రశ్న: రెస్క్యూ సమయాల్లో వన్యప్రాణుల సంరక్షణ పట్ల జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దానిపై మీ స్పందనేంటి?

మంత్రి: నల్గొండలో చిరుతను రక్షించే క్రమంలో అటవీ సిబ్బంది మత్తు మందు ఇచ్చారు. అనంతరం తరలించే సమయంలో తప్పించుకునేందుకు యత్నించింది. ఇద్దరు సిబ్బందికి గాయాలయయ్యాయి. కొద్ది దూరం వెళ్లాక చిరుత మరణించింది.

ప్రశ్న: కాటెదాన్​లో చిరుత సమాచారం అందిన వెంటనే అటవీ సిబ్బంది ఎందుకు సకాలంలో చేరుకోలేకపోయారు?

మంత్రి: అవసరమైన పరికరాలు, వ్యక్తిగత భద్రత కిట్లు తీసుకువెళ్లేందుకు సమయం పడుతుంది. రెస్క్యూ సమయంలో సిబ్బందికి గాయాలయిదే వారి భద్రతపై ప్రజల నుంచే ప్రశ్నలు తలెత్తుతాయి కదా.

జనావాసాల్లోకి చిరుతల రాకపై మంత్రి ఏమన్నారంటే..!

ఇవీచూడండి: పురిటినొప్పులతో విలవిల్లాడింది.. బావిలో పడి చనిపోయింది..

Last Updated : Jun 7, 2020, 12:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.