హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం మేడ్చల్ జిల్లా కేశవాపురం వద్ద 10 టీఎంసీల సామర్థ్యంతో.. నిర్మించ తలపెట్టిన జలాశయానికి తుదిదశ అటవీ అనుమతులు లభించాయి. జలాశయ నిర్మాణం కోసం 409 హెక్టార్ల అటవీ భూములను వినియోగించుకునేందుకు అనుమతి లభించింది. అటవీశాఖ తుదిదశ అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అటవీభూమికి ప్రత్యామ్నాయంగా అటవీయేతర భూముల్లో ప్రత్యామ్నాయ అడవుల పెంపకం చేపట్టాలని తెలిపింది. అవసరమైతే పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని అటవీశాఖ పేర్కొంది.
ఆ ప్రాంతంలో 1,39,274 కంటే ఎక్కువ చెట్లను తొలగించవద్దని... ఈ ప్రక్రియను అటవీశాఖ పర్యవేక్షించాలని తెలిపింది. జలాశయం, కాల్వల వెంట మొక్కలు నాటి సంరక్షించాలని స్పష్టం చేసింది
ఇవీ చూడండి: 'ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్'గా హైదరాబాద్