ETV Bharat / city

నేడు భారత్​ బయోటెక్​కు విదేశీ రాయబారులు, హైకమిషనర్లు

హైదరాబాద్​లోని భారత్ బయోటెక్​ను విదేశీ రాయబారులు, హైకమిషనర్ల బృందం నేడు సందర్శించనుంది. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరింటి వరకు నగరంలో ఈ బృందం పర్యటించనుంది. సందర్శన నేపథ్యంలో అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. కొవాగ్జిన్​ టీకా... రెండు దశల ట్రయల్స్​ని పూర్తి చేసుకుని మూడో దశ సైతం ముగింపు దశలో ఉన్న తరుణంలో ఈ సందర్శన మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

Foreigners Visit to Bharath Biotech in hyderabad
నేడు భారత్​ బయోటెక్​కు విదేశీ రాయబారులు, హైకమిషనర్లు
author img

By

Published : Dec 8, 2020, 5:57 PM IST

Updated : Dec 9, 2020, 5:23 AM IST

కొవిడ్ వ్యాక్సిన్ తయారీలో కీలకంగా వ్యవహరిస్తున్న భారత్ బయోటెక్​ను విదేశీ రాయబారులు, హైకమిషనర్ల బృందం ఇవాళ సందర్శించనుంది. దేశంలో కొవిడ్​పై జరుగుతున్న పరిశోధనలను విదేశీయులకు పరిచయం చేసే లక్ష్యంతో విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ ఉన్నత స్థాయి సందర్శనను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నేడు ఉదయం 10 గంటలకు 80 దేశాలకు చెందిన రాయబారులు, హైకమిషనర్లతో కూడిన బృందం ప్రత్యేక విమానంలో హైదరాబాద్​కి చేరుకుటుంది. జీఎంఆర్ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా భారత్ బయోటెక్​కి వెళ్లి అక్కడ కొవాగ్జిన్​కి సంబంధించి జరుగుతున్న ప్రయోగాలు, వాటి ఫలితాలను తెలుసుకుంటారు.

అనంతరం ప్రభుత్వ ఉన్నతాధికారులతో రాయబారుల బృందం భేటీ కానుంది. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరింటి వరకు ఈ పర్యటన కొనసాగనుంది. ఈ పర్యటనలో భాగంగా విదేశీ రాయబారులు దేశంలో కొవిడ్-19 వ్యాక్సిన్​పై పనిచేస్తున్న భారత బయోటెక్ లిమిటెడ్​తో పాటు... ఈ- బయోలాజికల్ సంస్థ యూనిట్లను సందర్శించనున్నారు. ఈ పర్యటన కోసం ఇప్పటికే అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన సీఎస్ సోమేశ్​ కుమార్... కొవిడ్ నిబంధనలను పాటిస్తూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎయిర్​పోర్ట్ నుంచి భారత్ బయోటెక్​కి చేరుకునేందుకు అన్ని సౌకర్యాలతో కూడిన 5 బస్సులు, ఒక ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిసింది.

భారత్ బయోటెక్ కొవిడ్ నియంత్రణకు రూపొందిస్తున్న కొవాగ్జిన్ వ్యాక్సిన్​... ఇప్పటికే మానవులపై రెండు దశల క్లినికల్ ట్రయల్స్​ని దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. మూడో దశ సైతం దాదాపు ముగింపు దశకు చేరుకుంది. కొవాగ్జిన్ అత్యవసర వినియోగ అనుమతుల కోసం భారత్‌ బయెటెక్‌ డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు కూడా చేసుకుంది. ఈ నేపథ్యంలో విదేశీ రాయబారులు, హైకమిషనర్ల సందర్శన మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చూడండి: భారత్​లో కరోనా టీకాపై బుధవారమే క్లారిటీ!

Last Updated : Dec 9, 2020, 5:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.