హయత్‌నగర్‌లో పారిశుద్ధ్య కార్మికులకు భాజపా నాయకుడు కళ్లెం రవీందర్ రెడ్డి అల్పాహారం అందించారు. లాక్‌డౌన్ కారణంగా విధులు నిర్వహించేప్పుడు తినడానికి తిండి లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారని, కరోనా కట్టడిలో పారిశుద్ధ్య కార్మికులే కీలకమన్నారు. హయత్‌నగర్ డివిజన్ పరిధిలో సుమారు 120 కాలనీల్లో పనిచేసే 200 మందికి 5రోజులుగా అల్పాహారం అందిస్తున్నట్టు, లాక్‌డౌన్ ముగిసే వరకు కొనసాగించనున్నట్టు తెలిపారు. ప్రజలు ప్రతి ఒక్కరూ సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు.
ఇదీ చూడండి:అపరిచిత వైరస్‌తో అపూర్వ పోరు!