రాష్టాన్ని లాక్డౌన్ చేసినప్పటికీ ప్రజలు యథేచ్ఛగా సంచరిస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు, కార్లలో యథావిధిగా తిరుగేస్తున్నారు. ఈక్రమంలో రాకపోకల్ని నిలువరించేందుకు పోలీసు శాఖ కఠినంగా వ్యవహరిస్తోంది. నగరంలోని ప్రధాన దారులన్నీ బారికేడ్లతో మూసేశారు. తెలుగుతల్లి, ఖైరతాబాద్ పైవంతెనలను పోలీసులు పూర్తిగా బంద్ చేశారు. కేవలం అంబులెన్స్‌లకు మాత్రమే దారి వదులుతున్నారు. మిగితా వాహనదారులను వెనక్కి పంపుతున్నారు. ఇంకా ఎవరైనా వస్తే.. కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
రేపటి నుంచి తిరిగితే...
రేపటి నుంచి తిరిగితే వాహనాలు జప్తు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పెట్రోల్ బంక్‌లకు పరిమిత సమయం మాత్రమే కేటాయించే సరికి.. వాహనదారులు బంకుల వద్ద బారులు తీరారు. ఐదుగురికి మించి ఉండొద్దని ప్రభుత్వం లాక్డౌన్ చేసినా.. పట్టించుకోని వారికి పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.