వరద సాయం కింద ప్రభుత్వం అందిస్తున్న రూ.10వేల ఆర్థిక సాయం అర్హులకు అందడం లేదని... హైదరాబాద్ చంపాపేట్‌లో వరద బాధితులు ఆందోళన చేశారు. రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో సంతోష్‌నగర్ నుంచి ఎల్బీనగర్ ప్రధాన రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
వర్షం నీరు ఇళ్లల్లోకి వచ్చి తమ వాహనాలు పూర్తిగా చెడిపోయాయని... అయినా ఇప్పటి వరకు అధికారులు ఎవరూ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధుల స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: సాయం కోసం ముంపు ప్రాంత బాధితుల ఆందోళన