ETV Bharat / city

క్వికర్​కు వినియోగదారుల కమిషన్ జరిమానా విధింపు - penalty for Quicker by consumer forum

మూడ్రోజుల్లో ఐఫోన్ అమ్మిపెడతానని హామీ ఇచ్చి ప్రకటన కోసం డబ్బు తీసుకుని స్పందించని క్వికర్ తీరును హైదరాబాద్ జిల్లా రెండో వినియోగదారుల కమిషన్ తప్పు పట్టింది. ప్రకటన కోసం వినియోగదారుడు చెల్లించిన నగదుతో పాటు రూ.5వేల జరిమానా, ఖర్చుల కింద మరో రూ.5వేలు చెల్లించాలని ఆదేశించింది.

five-thousand-rupees-penalty-for-quicker-by-hyderabad-consumer-forum
క్వికర్​కు వినియోగదారుల కమిషన్ జరిమానా విధింపు
author img

By

Published : Feb 21, 2021, 10:29 AM IST

హైదరాబాద్ కాచిగూడ ప్రైవేట్ హాస్టల్​లో ఉండే అజయ్ తన ఐఫోన్ అమ్మేందుకు గతేడాది ఏప్రిల్ 22న క్వికర్​లో పోస్టు చేశాడు. క్వికర్ ప్రతినిధి అజయ్​కి ఫోన్ చేసి రూ.999 చెల్లిస్తే ప్రీమియం ప్రకటనిస్తామని.. మూడ్రోజుల్లో ఫోన్ అమ్మిపెడతామని హామీ ఇచ్చారు. రూ.999 చెల్లించిన అజయ్​.. పలుమార్లు క్వికర్ ప్రతినిధులను సంప్రదించేందుకు ప్రయత్నించగా.. వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

తాను చెల్లించిన రూ.999 తిరిగి ఇవ్వాలని, తనకు మానసిక వేదన కలిగించినందుకు రూ.10 లక్షలు చెల్లించేలా క్వికర్​ను ఆదేశించాలని కోరుతూ వినియోగదారుల కమిషన్​ను ఆశ్రయించారు. దీనిపై వివరణ ఇవ్వాలని క్వికర్​కు వినియోగదారుల కమిషన్ నోటీసు ఇచ్చినా.. స్పందించలేదు. అజయ్ సమర్పించిన ఆధారాలను పరిశీలించి క్వికర్ సేవాలోపమేనని తేల్చిన కమిషన్.. అజయ్​కి రూ.999లు తిరిగవ్వడమే కాకుండా.. రూ.5వేల జరిమానా, ఖర్చుల కోసం మరో రూ.5వేలు చెల్లించాలని తీర్పు ఇచ్చింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.