నాటు తుపాకీలు తయారు చేస్తూ, వాటిని విక్రయిస్తున్న ఐదుగురిని ఏపీలోని విశాఖ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. కచ్చితమైన సమాచారం మేరకు కేసంతపాలెంలో పోలీసులు ఆకస్మికంగా దాడులు జరిపారు. ఈ గ్రామానికి చెందిన అప్పల నర్సయ్య, బల్లంకి సత్యనారాయణ, దేవరాపల్లికి చెందిన పాలవలస శంకరరావు, విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన మండా అప్పారావు మొత్తం నలుగురు తుపాకులు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. రామచంద్రపురానికి చెందిన గొర్లె గుర్రయ్య వీరికి అన్ని విధాలుగా సహకరించి విక్రయిస్తుంటాడని పోలీసులు దర్యాప్తులో తేలింది.
ఈ ఐదుగురిపై కేసు నమోదుచేసి, అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ నారాయణరావు తెలిపారు. తయారు చేయడానికి వినియోగించే సామగ్రితో పాటు 11 తుపాకీలు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఒక్కోదాన్ని రూ.5 వేలకు విక్రయిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఇదీ చదవండి: నక్సల్స్ చెరలో కోబ్రా కమాండో- నిజమెంత?