సముద్రంలో అందమైన చేపలు అనేకం ఉంటాయి. వీటిలో ముఖ్యమైనది ఏంజెల్. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో సోమవారం మత్స్యకారులకు ఈ అరుదైన మీనం చిక్కింది. దీనిని స్థానికంగా రాణి చేపగా పిలుస్తారు. ఇది సముద్రంలో పగడపు దిబ్బల్లో ఉంటుందని, ఏడాదికి ఒక్కటి దొరకడమూ అరుదేనని పూడిమడక మత్స్యకారులు తెలిపారు.
అందమైన చారలతో ఆకట్టుకునే రూపంలో కనిపించే దీనిని అక్వేరియంలో పెంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారని పేర్కొన్నారు. ఇది 5 కిలోల వరకు పెరుగుతుందని చెప్పారు. ఈ చేప శాస్త్రీయ నామం పోమాకాట్స్ అని మత్స్యశాఖ సహాయ సంచాలకురాలు శ్రావణి కుమారి తెలిపారు. సముద్రపు చేపల్లో అందమైనదిగా దీనిని గుర్తించారని ఆమె వివరించారు.
ఇదీ చదవండి: Murder attempt: యువతిపై హత్యాయత్నం.. ఇంట్లోకి వెళ్లి మరీ దారుణం!