తెలంగాణ సంగీత నాటక అకాడమీ, అభినయ థియేటర్ ఫెస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహిస్తున్న వర్చువల్ రాష్ట్రస్థాయి నాటకోత్సవాలు ఆకట్టుకున్నాయి. చిన్నారులు తమ అభినయంతో అదరహో అనిపించారు. ఓ వైపు సంగీతం, మరోవైపు పౌరాణిక నాటకాలతో ప్రతిభను చాటారు.
సమాజంలో ఆడపిల్లలపైనున్న వివక్షను కళ్లకు కట్టినట్టు చూపిస్తూ చిన్నారులు ప్రదర్శించిన 'అమ్మాయిలను కాపాడుకుందాం' నాటకం ఆలోచింపజేసింది. సరిత ఈ నాటికను రచించి, దర్శకత్వం వహించారు. అయోధ్యాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల 'పాండవోద్యోగం' పౌరాణిక నాటకం ఆకట్టుకుంది. దీనిని తిరుపతి వేంకటకవులు రచించగా.. నారాయణ దర్శకత్వం వహించారు.
ఇవీచూడండి: "లంబోదరా.. ఎట్లా కొలిచేదంటూ" భక్తి గీతం ఆలపించిన రామ్ మిర్యాల