మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సూరారం కృష్ణనగర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. జీపీ ఫుడ్ పరిశ్రమలోని బాయిలర్‌లో మంటలు చెలరేగాయి. ఆయిల్ లీక్ అవడం వల్లే ప్రమాదం సంభవించిందని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చూడండి: విద్యుత్ తీగలు తెగిపడి తల్లీకొడుకు సజీవదహనం