సికింద్రాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఫస్ట్ ఎవెన్ కాలనీలోని ఓ అపార్ట్మెంట్ పార్కింగ్‌లో ఉంచిన ద్విచక్ర వాహనాలకు మంటలు అంటుకున్నాయి. దాదాపు 20బైకులు దగ్ధమయ్యాయి. ప్రమాదానికి గల కారణాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు.
షార్ట్ సర్క్యూటా? ఎవరైనా నిప్పంటించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అపార్ట్మెంట్ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
ఇవీ చూడండి: పోతిరెడ్డిపాడుపై కాంగ్రెస్ సమరం.. గాంధీభవన్‌లో దీక్ష ప్రారంభం