ETV Bharat / city

ఎంపీ రేవంత్​ రెడ్డిపై కేసు నమోదు

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డితో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదైంది. కేటీఆర్ ఫాంహౌస్​ను అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాతో చిత్రీకరించినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం వారిని విడుదల చేశారు.

revanth
revanth
author img

By

Published : Mar 2, 2020, 9:02 PM IST

కాంగ్రెస్​ ఎంపీ రేవంత్​ రెడ్డితో పాటు మరో ఐదుగురిపై హైదరాబాద్​ నార్సింగ్​ పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదైంది. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జన్వాడ గ్రామం వద్ద మంత్రి కేటీఆర్‌ నిబంధనలకు విరుద్ధంగా ఫాంహౌస్‌ నిర్మిస్తున్నారని ఆరోపిస్తూ... ఎంపీ రేవంత్‌ రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వసర్​ రెడ్డి... మీడియాను వెంటతీసుకుని వెళ్లారు. జన్వాడ గ్రామం వద్ద 111 జీవోకు వ్యతిరేకంగా నిర్మాణాలు జరుగుతున్నాయని మీడియాకు వివరిస్తున్న సమయంలోనే పోలీసులు రంగప్రవేశం చేశారు. అదుపులోకి తీసుకుని పోలీసులు రామచంద్రాపురం పోలీసు స్టేషన్‌కు తరలించారు.

విషయం తెలుసుకున్న పలువురు కాంగ్రెస్‌ నేతలు స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. తక్షణమే తమ నాయకులను విడిచిపెట్టాలని డిమాండ్‌ చేస్తూ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. కేటీఆర్ ఫాంహౌస్​పై అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాతో చిత్రీకరించినందుకు రేవంత్​పై పోలీసులు కేసు నమోదు చేశారు. అదుపులోకి తీసుకున్నవారిని విడుదల చేశారు.

ఎంపీ రేవంత్​ రెడ్డిపై కేసు నమోదు

ఇదీ చూడండి: పోలీసుల అదుపులో ఎంపీ రేవంత్​రెడ్డి.. తీవ్ర ఉద్రిక్తత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.