రాష్ట్రంలో ఆక్సిజన్ నిల్వలపై దృష్టి సారించిన ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో నడుస్తోన్న ఐదో ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ గురువారం రాత్రి 10:30 గంటలకు సనత్‌నగర్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది.
గుజరాత్ రాష్ట్రంలోని కనలాస్ ప్రాంతంలో 81.04 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ నింపుకుని బయలుదేరిన ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్‌కు చేరుకుంది. గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయడం వల్ల వేగంగా రైలు గమ్యస్థానానికి చేరుకునే వెసులుబాటు కలిగిందని రైల్వే శాఖ వెల్లడించింది.
ఇదీ చదవండి: బ్లాక్‌ఫంగస్ కేసుల తీవ్రత దృష్ట్యా అప్రమత్తమైన ప్రభుత్వం