హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్లో దారుణం చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం 5 ఏళ్ల చిన్నారి యామినిని తండ్రి దుర్గారావు గొంతు నులిమి చంపేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. కన్న తండ్రి చిన్నారి కూతురుని చంపడం పట్ల బంధువులు, స్థానికులు కన్నీరు మున్నీరయ్యారు.