ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరులో రైతులు 13వ రోజు ఆందోళనలు, మహా ధర్నా కొనసాగిస్తున్నారు. తమ త్యాగాలను అవమానిస్తూ వైకాపా ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఏ కులానికో, మతానికో చెందిన వారిగా భూములు ఇవ్వలేదని స్పష్టం చేశారు. హై పవర్ కమిటీకి విశ్వసనీయత లేదన్న రైతులు.. ఇప్పటికైనా ప్రభుత్వం తీరు మార్చుకోవాలని డిమాండ్ చేశారు. తప్పుడు ప్రచారాలు ఆపాలని.. తమను పెయిడ్ ఆర్టిస్టులంటూ చేస్తున్న వ్యాఖ్యలు ఆపాలని డిమాండ్ చేశారు. అమరావతినే ప్రభుత్వం రాజధానిగా గుర్తించాలని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలు.. తుళ్లూరులో మహా ధర్నా శిబిరం నుంచి మా ప్రతినిధి అందిస్తారు.
ఇవీ చూడండి: మధ్య మానేరు ప్రాజెక్టు సందర్శనకు కేసీఆర్