ETV Bharat / city

Farmer's Mahadharna: ధర్నాచౌక్‌ వద్ద రేపు రైతుల మహాధర్నా - dharna

Farmer's Mahadharna: ధర్నాచౌక్‌ వద్ద రేపు రైతుల మహాధర్నా

author img

By

Published : Nov 24, 2021, 2:51 PM IST

14:43 November 24

Farmer's Mahadharna: ధర్నాచౌక్‌ వద్ద రేపు రైతుల మహాధర్నా

Farmer's Mahadharna: కొత్త వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతు సంఘాలు ఉద్యమం ప్రారంభించి ఏడాది పూర్తైన సందర్భంగా గురువారం ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌లో మహాధర్నా నిర్వహిస్తామని అఖిల భారత రైతు సంఘాల సమన్వయ కమిటీ తెలిపింది. జాతీయ రైతు సంఘాల నేతలు రాకేశ్‌ టికాయిత్‌, హన్నన్‌ మొల్ల, ఆశిష్‌ మిత్తల్‌ తదితరులు ఇందులో పాల్గొంటారు. రాష్ట్రంలో ధాన్యాన్ని తక్షణమే మద్దతు ధరకు కొనాలని, వరదలతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్​ చేస్తున్నట్లు కమిటీ నేతలు తెలిపారు. మహాధర్నాకు సంబంధించిన గోడపత్రికను మంగళవారం కమిటీ నేతలు పశ్య పద్మ, సాగర్‌, విస్సా కిరణ్‌, చంద్రశేఖర్‌ విడుదల చేశారు.

For All Latest Updates

TAGGED:

dharna
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.