Other States Farmers Praises CM KCR: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ, వ్యవసాయాభివృద్ధి పథకాలు, విధానాలను అమలు చేసేలా తమ రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తామని పలు రాష్ట్రాల రైతు సంఘాల నేతలు చెప్పారు. తెలంగాణలో వ్యవసాయ, సాగునీటి రంగ అభివృద్ధిని పరిశీలించేందుకు 25 రాష్ట్రాల రైతు సంఘాల నాయకులు, ప్రతినిధులు శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు. కేసీఆర్ వంటి ముఖ్యమంత్రి తమకూ ఉంటే బాగుండేదని పర్యటనకు వెళ్లిన ఇతర రాష్ట్రాల రైతులు తెలిపారు. తెలంగాణ రైతులు వ్యవసాయాన్ని లాభసాటిగా కొనసాగించడం ఆశ్చర్యం అనిపించిందని వారు అన్నారు. కేసీఆర్ రైతుబంధు కింద ఎకరానికి రూ.10 వేలు, రైతుబీమా పథకంలో రూ.5 లక్షల సాయం అందించడం దేశ చరిత్రలోనే గొప్ప పరిణామని ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రైతు నాయకుడు హిమాంశ్ పేర్కొన్నారు. కేసీఆర్ తెలంగాణకే కాదు, దేశానికే రైతు బాంధవుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉత్తర్‌ప్రదేశ్, ఝార్ఖండ్, ఒడిశా, పంజాబ్, కర్ణాటక తదితర 25 రాష్ట్రాలకు చెందిన రైతులు దాదాపు 100 మంది పాల్గొన్నారు.
Hyderabad news : మల్లన్నసాగర్ అద్భుతమని జాతీయ రైతు సంఘం నాయకులు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని మల్లన్నసాగర్‌ను శుక్రవారం వారు సందర్శించారు. రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు గోదావరి జలాల ఎత్తిపోతల పథకం గురించి వారికి వివరించారు. అనంతరం సింగాయిపల్లి అటవీ ప్రాంతాన్ని సందర్శించారు.
రైతు నాయకులు మల్లన్నసాగర్ కట్టను పరిశీలిస్తుండగా పంపుల్లో నీళ్లు వదిలారు. ఎనిమిదో పంపు నుంచి ఒక్కసారిగా భారీస్థాయిలో నీరు పైకి చిమ్మడంతో చూస్తున్నవారంతా తడిసిపోయారు. అందరూ పరుగులు తీయడంతో తోపులాట జరిగింది. కొందరు కింద పడడంతో గాయాలయ్యాయి. వారికి గజ్వేల్‌లో ప్రథమ చికిత్స చేశారు. వృద్ధులైన గోపాలకృష్ణ, కృష్ణమోహన్‌లను సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చదవండి: