Plantation on Women's day: హైదరాబాద్‌లోని హైదర్‌గూడ ఎమ్మెల్యేల నివాస సముదాయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పలువురు శాసనసభ్యుల కుటుంబ సభ్యులు మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మహిళా దినోత్సవం వేళ మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందని మంథని మున్సిపల్ ఛైర్మన్ పుట్ట శైలజ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు హరితహారం స్పూర్తితో ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమం అద్భుతమైనదని కొనియాడారు.
పర్యావరణం బాగుంటేనే...
women's day: వాతావరణ మార్పుల నేపథ్యంలో పర్యావరణం బాగుంటేనే మనమంతా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటామని ఎంపీ రంజిత్‌రెడ్డి సతీమణి సీత అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ వెంకటేశ్వరస్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఆమె జమ్మి మొక్క నాటారు. సినీ నటి రీతూ వర్మ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి నీరు పోశారు.
'ఎంపీ సంతోష్ కుమార్ పిలుపు మేరకు ప్రతి ఒక్క మహిళ మొక్కలు నాటాలి. వృక్షాలు లేకపోతే... మనం లేము. ప్రకృతి హితం దృష్ట్యా మొక్కలు నాటడం మనందరి బాధ్యత. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి.'
-సీత రంజిత్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ సతీమణి
ఈ కార్యక్రమాల్లో జూబ్లీహిల్స్ టీటీడీ సభ్యులు, ఆలయ కమిటీ పాలకవర్గం సభ్యులు, ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు కోరుకంటి ఉజ్వల, కాలేరు పద్మ, పుష్ప, మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, సంగీత, కోనేరు మధులిక, మంజుల, విజయ, కీర్తన, రమ్య తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:Women's day Celebrations: రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా మహిళా దినోత్సవం.. నారీమణులకు సన్మానం