మద్యం విక్రయానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు నకిలీ జీవో తయారీ చేసిన ఉప్పల్‌కు విజయపురి కాలనీకి చెందిన కె. శనీష్ కుమార్ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని విచారించగా... తాను ట్విట్టర్ నుంచి డౌన్లోడ్ చేసినట్టు చెప్పాడు. కానీ సంబంధిత ఖాతాను పరిశీలించగా ఎలాంటి జీవో కనపడలేదు. దీంతో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తప్పుడు సమాచారం వైరస్ చేసిన మరికొంత మందికి నోటీసులు జారీ చేసినట్టు పోలీసులు తెలిపారు.
గత శనివారం రోజున మధ్యాహ్నం రెండు నుంచి ఐదున్నర వరకు మద్యం విక్రయించనున్నట్టు ఆబ్కారీ శాఖ పేరున జీవోను సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు. అలా వేల మందికి సదరు సమాచారం చేరింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడి కోసం గాలించి పట్టుకున్నారు. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే ఎంతటి వారినైనా శిక్షిస్తామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ హెచ్చరించారు.
ఇవీచూడండి: తెలంగాణలో ఆరుకు చేరిన కరోనా మృతుల సంఖ్య