ఆరుగాలం శ్రమించి పండించిన పంట అకాల వర్షాలకు కళ్లముందే నీళ్లపాలవుతుంటే రైతు కన్నీరు పెట్టుకున్నాడు. వేలకు వేలు పెట్టి టార్పాలిన్ కొనే స్తోమత అన్నదాతలకు లేదు. అది గమనించిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి ...అందుకు ఓ ప్రత్యామ్నాయం ఆలోచించారు. వివిధ వస్తువులను పాడవకుండా వాడే ష్రింక్ ష్రింక్ వ్రాప్-సన్నటి ప్లాస్టిక్ కవర్‌ను కుదించి చుట్టే పద్ధతిని.... ధాన్యాన్ని కాపాడుకునేందుకు ఉపయోగించవచ్చని నిరూపించారు. దీని సాయంతో తక్కువ ఖర్చుతోనే పంట తడవకుండా కాపాడుకోవచ్చని చెబుతున్న విశ్వేశ్వర్‌రెడ్డితో ఈటీవీ భారత్ ప్రతినిధి మల్లిక్ ముఖాముఖి.
ఇవీచూడండి: రైతుల కోసం మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కొత్త ఆలోచన