కరోనా కష్టకాలంలో ఎల్ఆర్ఎస్ రూపంలో పేద, మధ్యతరగతి ప్రజల రక్తం పిలుస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి అన్నారు. తెరాసది ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఓట్లపై ప్రేమ ఉన్న తెరాస నాయకులు ప్రభుత్వం ఇవ్వాల్సిన పీఆర్సీ, ఐఆర్, డీఏ, ఉద్యోగాల గురించి ఎందుకు మాట్లాడడం లేదని మండిపడ్డారు.
రాష్ట్రం ఏర్పడ్డాక నియమించిన ఉద్యోగాలకన్నా తొలగించిన ఉద్యోగాలే ఎక్కువని అన్నారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి హామీలు ఎమయ్యాయని ప్రశ్నించారు. ఇది నిరుద్యోగుల వ్యతిరేక ప్రభుత్వమని ఆరోపించారు.
రాష్ట్రంలో ఉన్న లక్షన్నర ప్రభుత్వ ఖాళీలు, పదవీ విరమణ ద్వారా ఏర్పడిన మరో లక్ష ఖాళీలను వెంటనే భర్తిచేయాలని వంశీచంద్ రెడ్డి డిమాండ్ చేశారు. పంచాయతీ కార్యదర్శులు, జూనియర్ పంచాయతీ కార్యదర్శులతో పాటు ఇతర కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులతో శ్రమదోపిడీ చేసే తెరాస ప్రభుత్వంపై తిరగబడాలని సూచించారు.
ఇదీ చూడండి : 'రాష్ట్రానికి 10 లక్షల టన్నుల యూరియా కేటాయింపు'